Magha Masam: A Month of Devotion and Rituals
మాఘ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శుక్ల పక్ష చవితిని “తిల చతుర్థి” లేదా “కుంద చతుర్థి” అంటారు. ఈ మాసంలో నువ్వులు తింటారు, నువ్వుల లడ్డూలు చేసి పంచుతారు. డుంఢిరాజును ఉద్దేశించి నక్త వ్రతం పూజ చేస్తారు. ఇలా పూజించడం వలన దేవతలచేత కూడా పూజలందుకుంటారని కాశీ ఖండంలో ఉంది. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని పూజించి రాత్రి జాగరణ చేసినవారు సకలైశ్వర్యాలు పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. సాయంకాలం చతుర్థి తిథి ఉంటే మరింత మంచిది.
మాఘ మాసంలో ప్రాతఃకాల స్నానం, జపం, తపస్సు చేయడం చాలా ఉత్తమం. స్నానం చేసేటప్పుడు “దుఃఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!” అని, ఆ తర్వాత “సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!” అని చదివి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.
ఈ మాసాన్ని కుంభ మాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలలో ముల్లంగి దుంప తినరు. నువ్వులను, పంచదారను కలిపి తినాలి, నువ్వులను దానం చేయాలి. రాగి పాత్రలో గోధుమ రంగు నువ్వులను పాత్రతో సహా దానం చేస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట.
మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ రోజున సరస్వతీదేవి జన్మించింది. రతీ మన్మథులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉంటే, ఆయన తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి రెండు చేతులతో వీణను వాయిస్తూ, మరో రెండు చేతులతో పుస్తకాన్ని, మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చింది. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్ధతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది. అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతిని పూజించడం జరుగుతుంది.
మాఘ శుద్ధ సప్తమిని సూర్య సప్తమి లేదా రథ సప్తమి అంటారు. ఇది సూర్య గ్రహణదినం వలె పరమ పవిత్రమైనది. ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను, అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. “నమస్కారం ప్రియ: సూర్య:” అన్న ఆర్యోక్తి ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతోషిస్తాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి, కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. “ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం “సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్” అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుంది.
భీష్మాష్టమి మాఘ మాసంలో శుక్ల పక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడు. స్వచ్ఛంద మరణం ఆయనకు వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం, నెలవంక పెట్టినప్పటినుండి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందిన శ్రీకృష్ణుడు సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం మహిమాన్వితమైనది. ఈ విధంగా మాఘ మాసమంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే.
మాఘ మాసంలో, అంటే మకర రాశిలో రవి ఉండే సమయంలో నెల రోజులు నియమానుసారంగా మాఘ మాస స్నానం చేస్తే వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పద్మపురాణంలో పేర్కొనబడింది.
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్ |
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్ |
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్ |
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే
మాఘ మాసము యొక్క పవిత్రత మరియు విశిష్టత
మాఘ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో మాఘ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానం అంటే మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు నదీ, చెరువు, కుంట లేదా బావిలో స్నానం చేయడం. ఈ స్నానం చేయడం వలన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. ఈ సమయంలో చేసే స్నానానికి విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘ స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా, ఈ స్నానం చేయడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్ముతారు.
మాఘ స్నానం ఎలా చేయాలి?
మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు నిద్ర లేచి, స్నానం చేయడానికి సిద్ధం కావాలి. నదీ, చెరువు, కుంట లేదా బావిలో స్నానం చేయడం ఉత్తమం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, ఇంట్లో శుద్ధమైన నీటితో స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు “దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ ప్రాతఃస్నానం కరోమి మధ్యమాఘే పాప వినాశనం” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించడం వలన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
మాఘ స్నానం యొక్క ప్రాముఖ్యత
మాఘ మాసంలో చేసే స్నానం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. ఈ సమయంలో చేసే స్నానానికి విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘ స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా, ఈ స్నానం చేయడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్ముతారు.
మాఘ మాసంలో ఇతర చేయవలసినవి
మాఘ మాసంలో స్నానంతో పాటు ఇతర పుణ్య కార్యాలు కూడా చేయాలి. ఈ మాసంలో దానధర్మాలు చేయడం, పేదలకు సహాయం చేయడం వలన పుణ్యం లభిస్తుంది. అంతే కాకుండా, ఈ మాసంలో ఉపవాసం చేయడం కూడా మంచిది.
మాఘ మాసం యొక్క విశిష్టత
మాఘ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో మాఘ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా, ఈ స్నానం చేయడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్ముతారు.
మాఘస్నానానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్తవ్రచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ వుంది. మాఘపూర్ణిమనాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో, గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణ, గోదావరి, కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో, శివకేశవాది దేవతాస్మరణ, గంగాయమున, సరస్వతి, గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది.
పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.
సాధుజంతువులు మొగములు ముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులోని కాలువలు మెడవంచినట్లు – నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాగుచున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు గూడ సిగ్గుపడినవి. ఈవిధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు వుండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖం పట్టి ఇల్లు జేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను జూచి “సుశీలా! నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాది అలసిపోయి వున్నావు. పాపము! ఎండకు నీ సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా! రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమింపుము. ఆటలాడు కొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురూ పైకి ఏమియు ఎరుగని దానివలె నాటించెను. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటనే వుండిపోయెను.
మరికొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా! అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రి దీనికాలమెట్లు తీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకారమని భావింతురే! ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరు కదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!”అని పరిపరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో – “ఆర్యా! మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు” అని పలికెను.
అంతట సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామీ! మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును. మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు” అని వేడుకొనెను.
సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి “విప్రవర్యా! నీకుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగివుండి తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోరహత్యచేసి ఈజన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము గూడ వివరించెదను వినుము.
చాలా సంవత్సరాల క్రిందట అనగా – నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసంలో సూర్య భగవానుడు మకరరాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ తీరమునకు బోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీకుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలంచేతనే నీవంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహస్యంగా అడవికిపోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలననే యీ వైధవ్యం కలిగినది. పూర్వ జన్మవలన పవిత్రమైన నీ యింత పుట్టిననూ ఘోరపాపం చేసివున్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వ జన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తానూ చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి “హరిహరీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో యీ నాకుమార్తె తన భర్తను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకొన్నది. సరే ఈ జన్మలో కూడా కన్యగా వుండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటి ఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామీ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరియొకవైపు ప్రేమ కలుగుచున్నవి. గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి ణా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించ వలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.
ఓ సుబుద్దీ! నీకుమార్తె గురించి నీవడగక పోయినా తన్నివారణోపాయం వివరించవలయుననియే నేను యిలా వచ్చినాను. ఈ మాఘ మాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని, చెరువులోగాని, సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈవిధంగా మాఘమాసమంతయు నీకుమార్తె చేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.
మాఘ శుద్ధ విదియనాడు ముత్తయిదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతలో చీర, రవికల గుడ్డ, పసుపుకుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవచేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధంగా చేసినయెడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణ యగును.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయినను వారిని ప్రోత్సాహపరచి వారుకూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలయును. వంశాభివృద్ధికి గాని, కుటుంబ గౌరవానికి గాని, స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని, హరినామ కీర్తనలు గాని ఆలకించుచు, దానధర్మములు చేసినయెడల దానికన్న ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన యెడల వారిపిచ్చి కుదురును. కుష్ఠు వ్యాధితో బాధపడు వారలు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీగాని, పురుషుడు గాని మాఘ మాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు. అటుల చేసిన “చిత్తశుద్దిలేని శివపూజలేలరా” అనురీతిగా నిష్ప్రయోజనములగును. అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.
ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రమేల్కాంచిన వానివలె లేచి జరిగిన వృత్తాంతమును విని తానుకూడా తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.
మాఘ పూర్ణిమ ప్రత్యేకత:
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.
కార్తీక మాసం దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి.
మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
“మా – అఘం” అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
“మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే”
“ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే, అనగా … బ్రాహ్మీముహూర్తము
నుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి
మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును” అని అర్థం.
అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.
మాఘం అమోఘం:
మాఘమాసానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసానికి అధిపతి మాధవుడు. “మా” అంటే మహాలక్ష్మి, “ధవుడు” అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని “శ్రీపంచమి” అని అంటారు. “శ్రీ” అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
“శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే
శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా”
మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మి “శ్రీపంచమి”నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు “అక్షరాభ్యాసం” జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధ సప్తమి “రథసప్తమి” పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని “శివరాత్రి” పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి, మాఘశుద్ధ ఏకాదశి “భీష్మ ఏకాదశి” పర్వదినం చేశాడు.
త్రిమతాచార్యులలో ఒకరైన “మధ్వాచార్యుడు” ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని “మధ్వనవమి”గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు, వేడుకలు చేస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని “కేతువు” పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు “మఖ” నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి “మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే మాఘం – అమోఘం.
పితృయజ్ఞానికి ప్రాధాన్యత:
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు “పైతృకాలకు” ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే, ఆదివారం, అమావాస్య, శ్రవణనక్షత్రం, వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని “అర్ధోదయ పుణ్యకాలం” అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య, శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
మాఘపూర్ణిమ – మహామాఘి:
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే “మాఘమాసం”. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమటో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ, ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే … కనీసం “మాఘపూర్ణిమ” నాడైనా నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను “మహామాఘి” అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ “మాఘ పూర్ణిమ” అత్యంత విశేషమైనది. ఈ “మహామాఘి” శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ, కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
సముద్రస్నానం ఎందుకు చేయాలి:
“నదీనాం సాగరో గతి:”
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే … ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా “ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ”లలో చేయాలని, ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. “స్నానం” అంటే “షవర్ బాత్” చేయడమో, “స్విమ్మింగ్ పూల్”లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు … తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి “నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి” అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి, సోమశక్తులు, ఈ నాభి
మాఘమాసం చేస్తున్నప్పుడు :-
“దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”
అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే “దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు” అని అర్థం.
ఆ తరువాత …
“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా”
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే “ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక” అని అర్థం.
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబలములు [దుప్పటిలు], పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత, అవకాశం ఉన్నవారు “నేతితో తిలహోమం” చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
తిలల (నువ్వులు) ప్రత్యేకత :
నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కస్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు. శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే “తిలలు” … అనగా నువ్వులు. తిలలు సాక్షాత్తు విశ్నుస్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే, శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు, మూడువంతులు తిలలు కలిపి [1:3] శ్రీహరికి నివేదన చేసి, అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.
మాఘపూర్ణిమనాడు “తిల పాత్రదానము” చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే, ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి, వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి –
“వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం
బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే” అని సంకల్పించి –
“దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద
తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం”
అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం యివ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము, జాతకరీత్యా శనిదోష, పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి.
ఆఖరిగా ఓ మాట : –
మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ, ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని, అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి “పోటు” ఎక్కువగా ఉంటుంది. “పూర్ణిమ” దైవసంబంధమైన తిథి … అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమతిథినాడు రవి, చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి,చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి, చంద్రులకు, సముద్రానికి ఉన్న సంబంధం జగమెరిగిన సత్యం.
Keywords: Magha Masam, Hindu traditions, spiritual month, rituals, holy bathing, devotion, auspicious days, temple prayers, religious significance, panchangam.